Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా.. సీపీఐ మద్దతు

Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద జరిగిన ఉద్యోగుల ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొని 2వ పీఆర్సీ, సీపీఎస్ రద్దు, డీఏల విడుదలకు డిమాండ్ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 27 Aug 2026 4:55 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా.. సీపీఐ మద్దతు

కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన, దీర్ఘకాలిక డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్రవ్యాప్త ధర్నాలకు ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు నిర్వహించిన మహాధర్నాకు ఆయన హాజరై సంపూర్ణ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అలాంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.

ఉద్యోగులకు వెంటనే 2వ పీఆర్సీని ప్రకటించాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించే విధంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరారు.

అలాగే ఉద్యోగుల కోసం *పూర్తిస్థాయి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)*ను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం జరిగే పోరాటాలకు సీపీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సాబీర్ పాషా స్పష్టం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story