Kothagudem: కొత్తగూడెం జిల్లా కోర్టులో హైకోర్టు జడ్జి పర్యటన!
Kothagudem: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ జె. శ్రీనివాసరావు కొత్తగూడెం జిల్లా కోర్టును సందర్శించారు.
Kothagudem: కొత్తగూడెం జిల్లా కోర్టులో హైకోర్టు జడ్జి పర్యటన!
కొత్తగూడెం: జిల్లా కోర్టులో న్యాయవాదుల, కక్షిదారుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఔషధాలయమును ప్రారంభించాడానికి కొత్తగూడెం జిల్లా కోర్టుకు విచ్చేసిన న్యాయమూర్తిని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఘనంగా ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా
న్యాయమూర్తికి శాలువ కప్పి, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందించారు.
జిల్లాలో ఫ్యామిలీ కోర్టు యస్టి కోర్టు ఏర్పాటు చేయలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ మారపాక రమేష్ , అంబటి రమేష్, ఆడపాల పార్వతి, అడపాల మహాలక్ష్మి, మణిదీప్ నాయుడు, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story




