Kothagudem: కొత్తగూడెంలో కాంగ్రెస్ రణభేరి: ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ శవయాత్ర!
Kothagudem: అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ శవయాత్ర చేపట్టింది.
Kothagudem: కొత్తగూడెంలో కాంగ్రెస్ రణభేరి: ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ శవయాత్ర!
కొత్తగూడెం: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, రాష్ట్ర నాయకులు ఆళ్ల, ఊకంటి తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దిష్టిబొమ్మ శవయాత్ర సందర్భంగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పోలీసుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ఆగడాలు, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు మండల, పట్టణ నాయకులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్పొరేటర్లు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




