Kothagudem: కొత్తగూడెం మండలాల్లో ఓటరు నమోదు ఎస్‌ఐఆర్ గ్రామసభలు

Kothagudem: కొత్తగూడెం నియోజకవర్గంలో నిర్వహించిన ఓటరు నమోదు ఎస్‌ఐఆర్ 2వ విడత గ్రామసభల్లో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అబ్జర్వర్ ఎం. లింగోజీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 27 Aug 2026 6:42 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం మండలాల్లో ఓటరు నమోదు ఎస్‌ఐఆర్ గ్రామసభలు

కొత్తగూడెం: కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లో గురువారం నిర్వహించిన ఓటరు నమోదు S I R 2nd ఫేజ్ గ్రామసభల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కొత్తగూడెం నియోజకవర్గ S I R ప్రోగ్రామ్ PCC అబ్జర్వర్ M. లింగోజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... S I R ఫేస్-2 కార్యక్రమంలో BLOలు,BLAలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

గైర్హాజరు (Absent), వలసలు (Shifted), మరణించినవారు (Death), డబుల్ ఓట్లు (Double) ఉన్న ASDD జాబితాపై ప్రత్యేక దృష్టి సారించాలనీ, పేరు, వయస్సు, చిరునామాల్లో చిన్నచిన్న వ్యత్యాసాల కారణంగా నోటీసులు అందుకున్న అర్హులైన ఓటర్లను నేరుగా కలవాలనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన 14 రకాల గుర్తింపు కార్డులలో (ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డు, ఉపాధి హామీ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికెట్, పాస్ పోర్టు మొదలైనవి) ఏవైనా 2 ధ్రువ పత్రాలను ఓటరు నమోదు అధికారులకు సమర్పించి ప్రజల ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు

కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ఈ S I R ప్రక్రియను అడ్డంపెట్టుకుని చిన్నచిన్న కారణాలతో అర్హులైన పేదల ఓట్లను తొలగిస్తూ 'ఓటు చోరీ - సీటు చోరీ'కి పాల్పడుతోందని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలతో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బిజెపి పప్పులు ఇక్కడ ఉడకవని హెచ్చరించారు. ప్రజా హక్కులను రక్షిస్తూ, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న 'ప్రజాపాలన ప్రభుత్వం' తెలంగాణలో అధికారంలో ఉందనే విషయాన్ని గుర్తుచేశారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు హక్కు భద్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత BLO మరియు కాంగ్రెస్ BLAలపై ఉందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెదబాబు, PACS అధ్యక్షులు మండే.వీరహనుమంతరావు, పూణెం.శ్రీనివాస్, బాల ప్రసాద్ పాసి, అంతడపుల.కృష్ణ, నాగార్జున, ప్రజాప్రతినిధులు, వజ్జా. భాస్కర్, కేస్లీ, సాంబయ్య, జానీ, చావాల.పురుషోత్తం, బొల్లం.రమేష్, ఉబ్బన.రాజు, సెక్రటరీ లు, ప్రజాసంఘాల ప్రతినిధులు మరియ గ్రామస్థులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story