Kothagudem: కొత్తగూడెంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

Kothagudem: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 16 May 2026 4:46 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

Kothagudem: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ఆయిల్ కంపెనీలన్నిటినీ ప్రైవేటు పరం చేయడం వల్ల ఆయిల్ కంపెనీలు ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచుతున్నాయని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తుందని మోడీ ప్రభుత్వ విధానాలపై డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ ఫైర్ అయ్యారు.

కొత్తగూడెం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు. ప్రభుత్వానికి ఇందన కంపెనీల మీద నియంత్రణ లేదని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే‌ ధరలుపెంచి ప్రజలకు అధిక భారాన్ని మోపుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

నరేంద్ర మోడీ ప్రజాగ్రాహానికి గురి కాక తప్పదన్నారు. కేంద్రంలో ఉంది ప్రజల ప్రభుత్వం కాదని ఇది కార్పొరేట్ బడా పెట్టుబడిదారుల ప్రభుత్వమని ఆరోపించారు. సమస్యలకు పరిష్కారం చూపడం చేతకాక, సందర్భానుసారంగా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని నిలబెట్టుకోవడం, ప్రజలను మోసగించే విద్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పి.హెచ్.డి చేసారని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని,పెట్రోల్ -డీజిల్ గ్యాస్ ధరలను పెంచి ప్రజల మీద పారం మోపడం సరైంది కాదన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

మాట తప్పిన బిజెపి ..

బెంగాల్‌, తమిళనాడులో ఎన్నికల చివరి దశకు ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగవని చెప్పి.. ఇప్పుడు పెంచడం ద్వారా ఓటర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన సమయంలో కేంద్రం ప్రజలకు అనుకూలంగా ధరలు తగ్గించే విధంగా స్పందించని కేంద్రం ”ఇప్పుడు లీటర్ కు 3 రూపాయలు పెంచి, ఇంకా మరింత ధరలు పెరిగే సంకేతాలు ఇస్తూ, నిత్యావసర వస్తువుల ధరలపై అదనపు భారం మోపిందని, పేదల, సామాన్య ప్రజల నడ్డి విరచడమే బీజేపీ విధానమని విమర్శించారు.

12 ఏండ్లలో అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యల్ప స్థాయికి చేరినా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం కల్పించే లేదన్నారు. నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రజలపై ప్రేమే ఉంటే ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజల మీద మోపకూడదని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించక పోతే రాబోయే రోజుల్లో ప్రజలు రోడ్డెక్కి చేసే పోరాటాలకు మోడీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ స్పోక్ పర్సన్, రైల్వే బోర్డు మెంబెర్ ఎర్ర మల్లెల శ్రీనివాస్ రెడ్డి, సుజాతనగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story