Kothagudem: కొత్తగూడెంలో ముమ్మరంగా కాంగ్రెస్ గ్రామ కమిటీల ఏర్పాటు

Kothagudem: కొత్తగూడెం నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ, డివిజన్ కమిటీల ఏర్పాటు. పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 12 Aug 2026 5:11 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ముమ్మరంగా కాంగ్రెస్ గ్రామ కమిటీల ఏర్పాటు

కొత్తగూడెం: గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ శాఖ కమిటీల ఏర్పాటు కార్యక్రమం కొనసాగుతోంది. టీపీసీసీ, డీసీసీ ఆదేశాల మేరకు కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలతో పాటు కొత్తగూడెం పట్టణంలో పార్టీ గ్రామ, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు తెలిపారు.

ఇందులో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో లక్ష్మీదేవిపల్లి, లోతువాగు, హమాలీ కాలనీ, సంజయ్‌నగర్, ప్రశాంతినగర్, అశోక్‌నగర్, శ్రీనగర్ ప్రాంతాల్లో మొత్తం ఏడు గ్రామ శాఖ కమిటీలను ఏర్పాటు చేశారు.

గ్రామ కమిటీల ఏర్పాటు సమావేశాల్లో పాల్గొన్న జిల్లా నాయకులు మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని అన్ని గ్రామాలు, వార్డులు, డివిజన్లలో సంస్థాగతంగా బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికే లక్ష్మీదేవిపల్లి మండలంలో ఏడు కమిటీలను ఏర్పాటు చేశామని, పాల్వంచ మండలంలో గ్రామ శాఖ కమిటీలతో పాటు పట్టణంలో డివిజన్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. త్వరలో మండల, పట్టణ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లాలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తూనే పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల, పట్టణ అధ్యక్షులు, గ్రామ, డివిజన్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్పురి పెద్దబాబు, అధికార ప్రతినిధి వై. శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు మంద హనుమంతు, ఎస్కే. జానీ పాషా, జనరల్ సెక్రటరీలు పైడా రాజేంద్రప్రసాద్, లోశెట్టి నాగార్జున, కోశాధికారి కొదుమూరి శ్రీనివాసరావు..

వడ్డే సతీష్, కాంగ్రెస్ నాయకులు పూనెం శ్రీనివాస్, ఎండి గౌస్ పాషా, సర్పంచులు తాటి అనిత తాటి బాలకృష్ణ అజ్మీర లైలా.. ఉప సర్పంచులు పాలాది మహేష్, తాటి పద్మ ,తాటి తిరుమలేష్, తాళ్లపల్లి రాజు గౌడ్, అక్బర్, సురేష్, పూనెం రాములు,గుడివాక కవిత,మహబూబ్, బొల్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story