Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆశా వర్కర్‌పై దాడి తీవ్ర ఖండన

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆశా వర్కర్ ముర్రం మధులతపై దాడిని ఖండించిన CITU. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని DM&HO కు వినతి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 12 Aug 2026 9:27 PM IST
Kothagudem
X

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆశా వర్కర్‌పై దాడి తీవ్ర ఖండన

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కోయనర్సాపురం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ ముర్రం మధులతపై జరిగిన దాడిని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (CITU) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటి తీవ్రంగా ఖండించారు.

దాడిలో చెయ్యి విరిగిన ఆశ వర్కర్ మధులతకు న్యాయం చేయాలని దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంకోసారి ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని CITU ఆధ్వర్యంలో ఈరోజు డిఎంహెచ్ఓ గారికి ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది

DM&HO గారు స్పందిస్తూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ గారి సహకారంతో ఇట్లాంటి ఇంకోసారి జరగకుండా చూస్తామని తాడికి గురైన ఆశ వర్కర్ కు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు

ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి AJ రమేష్ కోశాధికారి జి. పద్మ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం కోసం ఇంటింటికీ తిరుగుతూ సర్వేలు నిర్వహిస్తున్న ఆశా వర్కర్‌పై దాడి చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. సమగ్ర సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లిన మధులత, ఇంటి వద్ద నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వాను గుర్తించి, దోమలు వృద్ధి చెందకుండా నీటిని తొలగించాలని సూచించారని తెలిపారు.

ఈ క్రమంలో జరిగిన వివాదంలో ముర్రం మధులతపై దాడి చేసి గాయపరిచిన ఘటనను CITU తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా ఆశా వర్కర్‌ను కొడతానని, చంపుతానని బెదిరించడం మరింత ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు.

“ఆశా వర్కర్లు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ప్రజల ఇళ్లకు వెళ్లే ఆశా వర్కర్లపై దాడులు జరిగితే వారు తమ విధులను ఎలా నిర్వహించగలరు?” అని ప్రశ్నించారు.

దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆశా వర్కర్ ముర్రం మధులతకు తక్షణమే రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. గాయపడిన ఆశా వర్కర్‌కు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లందరికీ ప్రభుత్వం పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, సర్వేలు, ఆరోగ్య కార్యక్రమాల కోసం గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లే ఆశా వర్కర్లకు గ్రామస్తులు సహకరించాలని AJ రమేష్ జి. పద్మ అన్నారు

ఆశా వర్కర్లపై దాడులు ఆపాలి – విధి నిర్వహణలో రక్షణ కల్పించాలి! ఆశా వర్కర్ ముర్రం మధులతకు న్యాయం చేయాలి!

వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని ఇలాంటి దాడులు జరగకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశా జిల్లా అధ్యక్షులు ఝాన్సీ జిల్లా కోశాధికారి జయ దుమ్ముగూడెం మండల ఆశా అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు నర్సు శిరోమణి భాగ్య సుజాత సుభద్ర జానకి లక్ష్మీ గాయపడిన వ్యక్తి మధులత జయలక్ష్మి నిర్మల సమ్మక్క తదితరులు పాల్గొన్నారు

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story