Kothagudem: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ హెచ్చరిక
Kothagudem: కొత్తగూడెం బీజేపీ కార్యాలయంలో 'ఫీజుల బకాయి బీజేపీ లడాయి' పోస్టర్ ఆవిష్కరణ. రూ.15 వేల కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్.
Kothagudem: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ హెచ్చరిక
కొత్తగూడెం: ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజి పై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ కౌంటర్ ఎటాక్ .. ఫీజుల బకాయి బీజేపీ లడాయి.. కొత్తగూడెం..లక్ష్మీదేవిపల్లి బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం.. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ పై యుద్ధ వాతావరణం సృష్టిస్తున్న కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను గమనించాలన్నారు.
ఈ సందర్భంగా ఫీజుల బకాయి బిజెపి లడాయి పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన 15 వేల కోట్ల రూపాయల వీరియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో విద్యార్థుల పేరు మీద కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు, హిందుత్వాన్ని వ్యతిరేకించేవారు గత ఐదు రోజులుగా దేశ రాజదాని ఢిల్లీలో చేస్తున్నటువంటి, దౌర్జ్యన్యాలు, యుద్ధ వాతావరణాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
వార్తా సేకరణకు వెళ్లిన మీడియాను, మహిళలని చూడకుండా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు విస్మరించిందని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కాక్రోచ్ జనతా పార్టీ నీడలో పనిచేసే దౌర్భాగ్యం పార్టీకి పట్టిందని ఎద్దేవా చేశారు. విదేశీయుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న దని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసి, తాము అధికారంలోకి వస్తే ఫ్రీ రియంబర్స్మెంట్ బకాయిల సమస్యలను, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని సరూర్నగర్ వేదికగా హామీలు ఇచ్చారని, ప్రియాంక గాంధీ, అనేక మంది నాయకులు హామీలు ఇచ్చారని విమర్శించారు.
తెలంగాణలో చదువుకుంటున్న ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ ఎంబీఏ సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు 15 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ స్కాలర్షిప్లు బకాయి ఉందన్నారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని, ఫీజులు కడితేనే హాల్ టికెట్లు, సర్టిఫికెట్స్ ఇస్తామని ఒత్తిడి చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని వివరించారు.
40 లక్షల మంది విద్యార్థుల పేద తల్లి తండ్రులు ఐదు రూపాయలు వడ్డీకి తెచ్చి,పిల్లలు చదువు కొనసాగించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల నుంచి బకాయిల వివరాలను స్వీకరించి, 15వేల కోట్లు విడుదల అయ్యేంతవరకు పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 3500 కోట్లు బాకీ ఉందని, బీఆర్ఎస్ పార్టీకి ఫీజు రీయింబర్స్మెంట్ పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
కాంగ్రె ప్రభుత్వంలో అనేక పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ప్రశ్నాపత్రాలు దిద్దలేని పరిస్థితి, మార్కులు కూడా సరిగా వేయలేని పరిస్థితి ఉండేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయాల్లో, పేపర్ లీకేజీ విషయంలో రాష్ట్రంలో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు.. నరేంద్ర మోడీ నీట్ పేపర్ లీక్ లో 12 మందిని అరెస్ట్ చేశారని, నరేంద్ర మోడీ పాలన పారదర్శకంగా ఉందన్నారు.
నీట్ తో సంబంధం లేని వాళ్ళు, దేశద్రోహులు, విద్యార్థుల పేరుతో విదేశీయులు విధ్వంసాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. భారతదేశం అభివృద్ధిలో ముందుకెళ్తున్నదని, ప్రపంచాన్ని శాసించే స్థాయిలో భారతదేశం ఉండడాన్ని ఓర్చుకోలేనటువంటి వారు అమెరికా చైనా పాకిస్తాన్ దేశాలకు తొత్తులుగా మారి విద్వేషాలు,విధ్వంసాలు సృష్టిస్తున్నారని, 140 కోట్ల మంది భారతీయులకు వాస్తవాలు తెలుసని, తప్పనిసరిగా తిరగబడతారని, తగిన బుద్ధి చెప్తారన్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామని, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి విద్యార్థుల పట్ల ప్రేమ ఉంటే15,000 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు 15 వేల కోట్లు చెల్లించే వరకు దశలవారీగా ఉద్యమ కార్యాచరణ చేపడుతామని హెచ్చరించారు.విద్యార్థులకు, యువకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని కాంగ్రెస్ నాయకులను, మంత్రులను సవాల్ చేశారు.




