Kothagudem: కొత్తగూడెంలో బీజేపీ నిరసన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం!

Kothagudem: బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 22 July 2026 3:23 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో బీజేపీ నిరసన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం!

Kothagudem: భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ...

"ఢిల్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే శక్తులకు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారని మేము భావిస్తున్నామన్నారు..

దేశంలో అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం కాంగ్రెస్ పార్టీకి కొత్త విషయం కాదని విమర్శించారు..

"ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అన్నారు.

సమస్యలు ఉంటే పార్లమెంట్‌లో, చట్టసభల్లో చర్చించి ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కారం కనుగొనాలని,

నిరసనల పేరుతో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించడం ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు.

"భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా దేశానికి సేవ చేస్తోందని వివరించారు.

దేశ సమైక్యత, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ బిజెపి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story