Kothagudem: 76 జీవో అమలుపై మంత్రి హామీ బీజేపీ పోరాట విజయమే!

Kothagudem: కొత్తగూడెంలో 76 జీవో అమలుపై మంత్రి పొంగులేటి హామీని స్వాగతించిన బీజేపీ. అర్హులైన పేదలందరికీ ఈ నెలాఖరులోగా ఇంటి పట్టాలు ఇవ్వాలని శీలం విద్యాసాగర్ డిమాండ్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 12 Sept 2026 6:26 PM IST
Kothagudem
X

Kothagudem: 76 జీవో అమలుపై మంత్రి హామీ బీజేపీ పోరాట విజయమే!

Kothagudem: 76 జీవో అమలు చేసి అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటానికి ఫలితం లభించిందని ఆ పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ అన్నారు. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 76 జీవోను అమలు చేస్తామని, ఈ నెలాఖరులోపు అర్హులైన వారికి ఇంటి పట్టాలు అందిస్తామని హామీ ఇవ్వడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. 76 జీవో అమలు కోసం బీజేపీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి అసెంబ్లీ వేదికగా హామీ ఇవ్వడం ప్రజా పోరాట విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఇంటి పట్టాల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నెలాఖరులోపు పట్టాలు అందించాలని ఆయన కోరారు. అలాగే ఇప్పటివరకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోలేని అర్హులకు మరో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పట్టాల పంపిణీ ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అర్హులైన వారు నష్టపోకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నోముల రమేష్, ఆదిముల రాములు, కనుకుంట్ల రాజమొగిలి, కొత్తూరు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కలంకార్ రాజశేఖర్, చంద్రగిరి రమేష్, పట్టణ నాయకులు భాస్కర్ గౌడ్, గిరి, హృదయ్, రాజేష్, లలిత్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM