Kothagudem: అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా గర్భిణీలకు శ్రీమంతాలు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం 31వ డివిజన్ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలకు ఘనంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 20 Aug 2026 6:07 PM IST
Kothagudem
X

Kothagudem: అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా గర్భిణీలకు శ్రీమంతాలు!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీల కోసం శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 31వ డివిజన్ కార్పొరేటర్ శ్యామల దినేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గర్భిణీలకు చీరలు, పూలు, పండ్లు అందజేసి వారిని సత్కరించారు. అనంతరం కార్పొరేటర్ శ్యామల దినేష్ మాట్లాడుతూ.. తన చేతుల మీదుగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అంగన్వాడీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story