Kothagudem: కొత్తగూడెంలో అర్ధనగ్నంగా ఆటో కార్మికుల నిరసన!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ఆటో కార్మికుల వినూత్న నిరసన. తాడుతో ఆటోలను లాగుతూ, అర్ధనగ్నంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రదర్శన.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 May 2026 2:11 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో అర్ధనగ్నంగా ఆటో కార్మికుల నిరసన!

కొత్తగూడెం: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అర్ధ నగ్నంగా, ఆటోలను లాగుతూ విన్నూత నిరసన తెలిపారు. అడ్డగోలుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని పెరుగుతున్న ధరలకు నిరసనగా యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని ఆటో కార్మికులు శుక్రవారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు.

పట్టణంలోని పోస్టాఫీసు సెంటర్ నుంచి బస్టాండు సెంటర్ వరకు అర్ధ నగ్నంగా ఆటోలకు తాడుకట్టి లాగుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు.

జమలయ్య మాట్లాడుతూ..

స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికులపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోయలేని భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ పేదలను నట్టేట ముంచుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేవలం 11 రోజుల్లోనే ఐదు సార్లు డీజిల్ ధర పెంచి ఆటో కార్మికుల నడ్డివిరిచారని మండిపడ్డారు.

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటో కార్మికులను ఈ ధరల పెరుగుదల మరింత కుంగదీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాలను తగ్గించి, కార్మికులను ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మర్రి కృష్ణ, అబ్బులు, మంద శ్రీను, బాబు జానీ, ఆరేల్లి, కృష్ణ, రాంబాబు, దేశి, బడుగు భాస్కర్, చింటూ, లక్ష్మణ్, సంపత్, విజ్జి, మండల రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story