Khammam: ఖమ్మం జిల్లా ఆదివాసీ ST అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానం!

Khammam: ఖమ్మం జిల్లా ఆదివాసీ (ST) డిపార్ట్‌మెంట్ జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 15 Sept 2026 3:27 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం జిల్లా ఆదివాసీ ST అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానం!

Khammam: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివాసి(ST)డిపార్ట్‌మెంట్ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా ఆదివాసీ(ST) డిపార్ట్‌మెంట్ జిల్లా అధ్యక్ష పదవి కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు.

ఔత్సాహిక అభ్యర్థుల నుండి నేడు ది 16-09-2026 న ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 04.00 గంటల వరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదివాసి ఉపాధ్యక్షులు కూరాకుల మల్లిఖార్జున జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ల సమక్షంలో జరుగుతుందని తెలిపారు.

కావున కాంగ్రెస్ పార్టీ భావజాలం కలిగి ఉండి, పార్టీ కొరకు నిబద్ధతతో పనిచేయాలనుకునే ఔత్సాహిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.