Khammam: ఖమ్మం వినూత్న సెన్సార్ పరికరాన్ని కనిపెట్టిన విద్యార్థి

Khammam: ఖమ్మం జిల్లా కూసుమంచి గ్లోబల్ రెయిన్‌బో విద్యార్థి యశ్వంత్ ఆవిష్కరణ. సెన్సార్ సాంకేతికతతో రూ.800కే పొడవు కొలిచే డిజిటల్ పరికరాన్ని తయారు చేసిన వైనం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 18 July 2026 8:51 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం వినూత్న సెన్సార్ పరికరాన్ని కనిపెట్టిన విద్యార్థి

ఖమ్మం: ప్రతి విద్యార్థిలో ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది.. అది చదువులోనైనా... క్రీడలోనైనా... జనరల్ నాలెడ్జ్ లోనైనా.. కానీ తొమ్మిదో తరగతి చదివే ఒక బుడ్డోడు తనకు తన మస్తిష్కంలో నుంచి ఉద్భవించిన ఒక యోచనను తన పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులతో పంచుకొని.. వారి సహకారంతో భారతదేశ ప్రజానీకానికి ఉపయుక్తంగా మారిన ఒక వస్తువును కనుగొన్నాడు.. ఇంతకీ ఆ బుడ్డోడు ఎవరు? ఎంటా వస్తువు.. ఏ ఊరు ఏ స్కూల్లో చదువు తున్నాడు..? అనేకదా మీ సందేహం. ఇంకెవరండి ఇదిగో చదివేయండి.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో గల గ్లోబల్ రెయిన్ బో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి పి. యశ్వంత్ తన ప్రతిభను చాటుతూ... సెన్సార్ సాంకేతికత ఆధారంగా పొడవును కొలిచే ఒక వినూత్న పరికరాన్ని ఉపాధ్యాయుల సహాయంతో కనుగొని ఆవిష్కరించాడు..

ఈపరికరం ద్వారా ఒక వస్తువు పొడవును,ఒక ప్రదేశం ,పొడవును అత్యంత సులభంగా, వేగంగా కొలవవచ్చు. కొలిచిన పొడవును నేరుగా డిజిటల్ డిస్ ప్లే పై కనిపించేలా దీనిని రూపొందించడం విశేషం. ఈ పరికరం గరిష్ఠంగా 5 మీటర్ల వరకు పొడవున ఖచ్చితంగా కొలిచి డిస్ ప్లే లో చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆధునిక సెన్సార్ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఈ ఆవిష్కరణ విద్యార్థి సృజనాత్మకతకు, శాస్త్రీయ ఆలోచనా విధానానికి నిదర్శనంగా నిలిచింది. దీనిని ₹ 800/- ఖర్చుతో రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎండీ ఏర్షాద్ అహ్మద్ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందిస్తూ, చిన్న వయస్సులోనే ఇలాంటి వినూత్న ఆవిష్కరణ చేయడం ఎంతో గర్వకారణమన్నారు.

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు "గ్లోబల్ రెయిన్బో పాఠశాల" ఎల్లప్పుడూ ముందు వుంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు చేసి పాఠశాలకు, తల్లి దండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకు రావాలని విద్యార్థి యశ్వంత్ ను పాఠశాల అధినేత ప్రత్యేకంగా అభినందించారు.. ఈమేరకు కూసుమంచి మండల ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయేతర, రాజకీయ నాయకులు, మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు, ఉద్యమ కారులు, ప్రొఫెసర్లు బుడ్డోడి టాలెంట్ కు సలాం చేస్తూ... హర్షం వ్యక్తం చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story