Julurpadu: జూలూరుపాడులో విజయవంతమైన విద్యాసంస్థల బంద్

Julurpadu: నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ జూలూరుపాడులో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం. కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 24 July 2026 3:25 PM IST
Julurpadu
X

Julurpadu: జూలూరుపాడులో విజయవంతమైన విద్యాసంస్థల బంద్

జూలూరుపాడు: వామపక్ష విద్యార్థి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జూలూరుపాడుల విద్యాసంస్థల బందును విజయవంతంగా జరిగింది.

ఈ సందర్భంగా మండల కేంద్రంలో AISF-SFI ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ మాట్లాడుతూ, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పృద్వి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ కి కారకులైన వారిపై అదేవిధంగా లీకేజ్ గా నైతిక బాధిత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా రాజీనామా చేయాలని ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు జంతర్ మంతర్లో ధర్నా చేస్తుంటే విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అత్యంత దారుణమని కాదురా వారు వ్యక్తం చేశారు.

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 కంటే తర్వాత 89 పేపర్లు లీకేజ్ ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవేదని వ్యక్తం చేశారు. తక్షణమే నీ పరీక్షలు నిర్వహించే ఎన్ టి ఏ ఏజెన్సీని ప్రవేట్ వ్యక్తులకు అప్పజెప్పి ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కావడం వల్ల 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు ఒక ప్రభుత్వ ఉద్యోగము మరియు 50 లక్షల ఎక్స్గ్రేషియా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. నీట్ లీకేజ్ పేపర్ కి లీకేజ్ కి కారణమై 22.50 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వి బి ఎస్ బిల్లుతో నూతన విద్యా విధానాన్ని 2025 బిల్లును ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం VBSA బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఎదులాపురం గోపాలరావు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో AIYF మండల కార్యదర్శి పసుపులేటి పవన్ జిల్లా సమితి సభ్యులు అనిల్ కుమార్ ఏఐఎస్ఎఫ్ నాయకులు అఖిల్ దినేష్ చరణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్ రామ్ చరణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story