Kothagudem: ఎమ్మెల్సీ బరిలో గడల శ్రీనివాసరావు? జనసేనలో ఆసక్తికర చర్చ!

Kothagudem: వరంగల్–ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి జనసేన తెలంగాణ అధికార ప్రతినిధి గడల శ్రీనివాసరావు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 22 Aug 2026 6:50 PM IST
Kothagudem
X

Kothagudem: ఎమ్మెల్సీ బరిలో గడల శ్రీనివాసరావు? జనసేనలో ఆసక్తికర చర్చ!

భద్రాద్రి కొత్తగూడెం: జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గడల శ్రీనివాసరావు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఖమ్మం-వరంగల్-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడానికి గడల సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పట్టభద్రులు, యువత, విద్యార్థుల సమస్యలను శాసనమండలి వేదికగా ప్రస్తావించేందుకు అవకాశం కల్పిస్తే ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.

అయితే గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం జనసేన పార్టీ అధిష్టానం తీసుకోవాల్సి ఉంది. పార్టీ నాయకత్వం నిర్ణయం ప్రకటించిన అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story