Aswaraopeta: చలో సెక్రటేరియట్ అడ్డుకట్ట జక్కుల రాంబాబు ముందస్తు అరెస్ట్!
Aswaraopeta: హలో మాల - చలో సెక్రటేరియట్ నేపధ్యంలో అశ్వారావుపేట మాల మహానాడు కన్వీనర్ జక్కుల రాంబాబును అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు. మాల సంఘాల ఆగ్రహం.
Aswaraopeta: చలో సెక్రటేరియట్ అడ్డుకట్ట జక్కుల రాంబాబు ముందస్తు అరెస్ట్!
Aswaraopeta: మాలల రోస్టర్ విధానాన్ని సవరించాలని, 99 జీవోను ఎత్తివేయాలని ఈ రోజు (సోమవారం )తలపెట్టిన హలో మాల - చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి వెళ్లకుండా అశ్వారావుపేట మాల మహానాడు కన్వీనర్ జక్కుల రాంబాబును పోలీసులు ఈ రోజు అర్ధరాత్రి ముందస్తు అక్రమ అరెస్ట్ చేశారు.
జాతీయ మాల మహానాడు పిలుపు మేరకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యకు పాల్పడటం దుర్మార్గమని మాల సంఘ నాయకులు మండిపడుతున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపు మేరకు విజయవంతం చేయాల్సిన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం కావాలనే అక్రమ అరెస్టులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. తమ న్యాయమైన విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. జక్కుల రాంబాబును వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.




