Kothagudem: కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శిగా జె.గట్టయ్య!

Kothagudem: కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జె.గట్టయ్యను కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ జీఎం సీహెచ్.వెంకటరమణకు పరిచయం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 8 Aug 2026 4:08 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శిగా జె.గట్టయ్య!

Kothagudem: కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జె.గట్టయ్యను ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్‌ శనివారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్.వెంకటరమణకు పరిచయం చేశారు.అనంతరం ఏరియాలోని పలువురు అధికారులను కూడా ఆయనకు పరిచయం చేశారు.ఈ సందర్భంగా వంగ వెంకట్‌ మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి ఏఐటీయూసీ సమాన ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకతను పెంపొందిస్తూ సింగరేణి మనుగడను కాపాడే విషయంలో ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.

అదే సమయంలో కార్మికుల న్యాయమైన సమస్యలు, హక్కులు, సంక్షేమ అంశాలపై నిరంతరం పోరాడుతూ వాటి పరిష్కారం కోసం యాజమాన్యంతో నిర్మాణాత్మకంగా చర్చలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించి ఏఐటీయూసీకి పూర్తి సహకారం అందించాలని జీఎం సీహెచ్.వెంకటరమణను కోరారు.

కార్మికులు, యాజమాన్యం పరస్పర సహకారంతో పనిచేస్తే సంస్థ మరింత అభివృద్ధి సాధించడంతో పాటు కార్మిక సంక్షేమం కూడా మెరుగుపడుతుందని అన్నారు.అనంతరం నూతన బ్రాంచ్ కార్యదర్శి జె.గట్టయ్యకు అధికారులు,నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఏరియా పరిధిలో కార్మికుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ఏఐటీయూసీని మరింత బలోపేతం చేయాలని,రానున్న రోజుల్లో కూడా యూనియన్ ను గెలుపొందే విధంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, సత్తుపల్లి కార్యదర్శి సముద్రాల సుధాకర్, ఆఫీస్ బేరర్ సందబోయిన శ్రీనివాస్, పిట్ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్, సౌజన్య, నాయకులు రాజాలపూడి సాంబమూర్తి, భీమయ్య, నరసింహారావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story