Kothagudem: కొత్తగూడెంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం!
Kothagudem: కొత్తగూడెంలో ఉరుములు, మెరుపులతో దంచికొట్టిన భారీ వర్షం. జలమయమైన రహదారులు, పంటలకు మేలు జరుగుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.
Kothagudem: కొత్తగూడెంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం!
Kothagudem: కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం వరకు వేడి, ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
భారీ వర్షంతో కొత్తగూడెం పట్టణంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు, ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు, ప్రస్తుతం కురుస్తున్న వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కొరత కొంతవరకు తీరడంతో పాటు పంటలకు అవసరమైన తేమ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. జిల్లాలో రానున్న రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.




