Bhadrachalam: గోండి-కోయ భాషా ప్రామాణీకరణ వర్క్‌షాప్ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ!

Bhadrachalam: భద్రాచలంలో అక్టోబర్ 2 నుంచి గోండి-కోయ భాషా ప్రామాణీకరణ, డిక్షనరీ జాతీయ వర్క్‌షాప్. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఐటీడీఏ పీవో బి. రాహుల్.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 16 Sept 2026 8:38 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: గోండి-కోయ భాషా ప్రామాణీకరణ వర్క్‌షాప్ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ!

Bhadrachalam: భద్రాచలం సెప్టెంబర్ 16- అక్టోబర్, 2 నుండి 6 వరకు 5 రోజుల పాటు జర్గనున్న జాతీయ స్థాయి కోయ గోండి భాషా ప్రామాణీకరణ, డిక్షనరీ వర్క్ షాప్ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.

తన చాంబర్లో ఆదివాసి ప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ కి ఐటీడీఏ ఆతిధ్య సహకారం అంధిస్తుండగా, జాతీయ గోండి కోయ భాషా ప్రామాణికరణ, డిక్షనరీ మరియు రికగ్నైషన్ సమన్వయ కమిటీ సమన్వయం చేస్తూ ఆర్గనైజ్ చేస్తుందని, ఈ కార్యక్రమానికి ఆంధ్రా, తెలంగాణతోపాటు, చ్చత్తిస్గడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్కండ్, అస్సాం మొత్తం 8 రాష్ట్రాల నుండి సుమారు 120 మంది కోయ గోండి ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన అన్నారు.ఈ వర్క్ షాప్ కి సాధ్యమైనంతవరకు ప్రముఖులతోపాటు అందరిని ఆహ్వానించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోండ్రు వీరాస్వామి, సీనియర్ కోయ భాషా రిసోర్స్ పర్సన్ పాయం వెంకటరత్నం, కారం దారయ్య, ఇర్ప రాధాకృష్ణ మూర్తి, కాక రాజు, కణితి రామకృష్ణ, వీసాల శ్రీలక్ష్మి, మడివి గురుత్వ, మడివి సూక్ష్మ తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem