Bhadrachalam: సివిల్స్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్: భద్రాచలం ఐటీడీఏ పీవో!
Bhadrachalam: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 పరీక్షకు ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ తెలిపారు.
Bhadrachalam: సివిల్స్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్: భద్రాచలం ఐటీడీఏ పీవో!
భద్రాచలం సెప్టెంబర్ 10: శ్రీరామ్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో, UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2027 (ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు పర్సనాలిటీ టెస్ట్) కోసం'ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ స్కీమ్ కింద అభ్యర్థులను ఎంపిక చేసే అర్హత పరీక్షకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన ST, SC, BC అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, మానసహిల్స్ వద్ద ఉన్న IAS స్టడీ సర్కిల్ ఫర్ STsలో రెసిడెన్షియల్ పద్ధతిలో 8 నెలల పాటు లేదా ప్రిలిమ్స్ పరీక్ష తేదీ వరకు ఉచిత కోచింగ్ మరియు మార్గదర్శకత్వం అందించబడుతుందని ఆయన అన్నారు. అభ్యర్థులు wefare. Sriramsias.com వెబ్సైట్ ద్వారా ఈనెల 9వ తేదీ నుండి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని అన్నారు.
అభ్యర్థులకు ఈనెల 27వ తేదీన యూపీఎస్సీ, సిఎస్సి ప్రిలిమ్స్ ప్రమాణాల సమయం ప్రకారం ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయని, అక్టోబర్ 1 నాడు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూ నిర్వహించబడుతుందని, అక్టోబర్ 2న ఎంపికైన అభ్యర్థుల తుది ఫలితాలు వెలువడుతాయని, అక్టోబర్ 5 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు.




