Kothagudem: అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయకుడి ప్రతిష్ఠ!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహం ప్రతిష్ఠ. ప్రకృతి పరిరక్షణపై అవగాహన.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 15 Sept 2026 4:48 PM IST
Kothagudem
X

Kothagudem: అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయకుడి ప్రతిష్ఠ!

Kothagudem: వినాయక చవితి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కొత్తగూడెంలోని వనవిహార్ కాంప్లెక్స్‌లో ఉన్న అటవీశాఖ కార్యాలయంలో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించడం వల్ల నీటి వనరులు, నేల, జీవ వైవిధ్యంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకృతిని పరిరక్షించడమే నిజమైన పూజ అని, పర్యావరణహిత వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

మట్టి వినాయకుడు.. పర్యావరణ పరిరక్షణకు మన వంతు అడుగు అనే సందేశాన్ని ఈ సందర్భంగా అటవీశాఖ ప్రజలకు అందించింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM