Kothagudem: విద్యార్థుల కోసం రోడ్డెక్కితే అరెస్ట్ చేస్తారా? బీజేపీ వార్నింగ్!

Kothagudem: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతల ముందస్తు అరెస్టులను ఖండించిన కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 7 Sept 2026 4:39 PM IST
Kothagudem
X

Kothagudem: విద్యార్థుల కోసం రోడ్డెక్కితే అరెస్ట్ చేస్తారా? బీజేపీ వార్నింగ్!

కొత్తగూడెం: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరుకాకుండా ముందస్తు అరెస్టులు చేయడాన్ని బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఖండించారు.

రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల చదువుకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు ముందస్తు అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. తమను అరెస్ట్ చేసినా విద్యార్థుల సమస్యలపై బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని శీలం విద్యాసాగర్ హెచ్చరించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story