Illendu: ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే: హరిప్రియ!

Illendu: ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతగా సెప్టెంబర్ 17న పాలాభిషేకాలు నిర్వహించాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

SHOBAN BABU, YELLANDU
Published on: 15 Sept 2026 4:24 PM IST
Illendu
X

Illendu: ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే: హరిప్రియ!

ఇల్లందు: ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కి దక్కుతుందని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు.శుక్రవారం ఇల్లందు brs పార్టీ కార్యాలయం లో జరిగిన సమావేశం లో ఆమె పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి పరిచారని తెలిపారు.

తండాలను గూడెలను గ్రామపంచాయతీగా చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని వివరించారు తెలంగాణ అసెంబ్లీలో గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోడు భూములకు లక్షలాది ఎకరాల్లో గిరిజనలకు పోడు పట్టాలు అందించింది కేసీఆర్ అని హరిప్రియ తెలిపారు.

తెలంగాణలో ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించిన కేసీఆర్కు కృతజ్ఞతగా ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పాలాభిషేకం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని గ్రామపంచాయతీలలో సెప్టెంబర్ 17న జెండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అంగోత్ బిందు,టిఆర్ఎస్ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, లక్కినేని సురేందర్,ఎస్ రంగనాథ్, చిలువేరు సత్యనారాయణ, శ్రీలం రమేష్,ఎండి జబ్బర్, భూక్య దళ్ సింగ్, దేవిలాల్ నాయక్, తాత గణేష్ బొమ్మర వరప్రసాద్, బండారి శ్రీనివాస్, సర్పంచులు ఏపే శంకర్ కుంజా సుగుణయ్య తదితరులు పాల్గొన్నారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU