Kukkunuru: వేలేరుపాడుల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు, వైద్య శిబిరాలు!
Kukkunuru: ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో వేలేరుపాడు, కుక్కునూరుల్లో పారిశుద్ధ్య పనులు, వైద్య శిబిరాలు ముమ్మరం. NDRF, SDRF బృందాలు బాధితులను తరలించాయి.
Kukkunuru: వేలేరుపాడుల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు, వైద్య శిబిరాలు!
జిల్లా : ఏలూరు.
వరద ప్రభావిత గ్రామాలలో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య శిబిరాలు..
ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాలతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వరద ప్రభావిత గ్రామాలలో అధికార యంత్రాంగం ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టింది. వరదనీరు తగ్గిన తరవాత అంటువ్యాధులు, దోమలు ప్రబలకుండా గణపవరం, అమరవరం , మారేడుబాక, కుక్కునూరు, వేలేరుపాడు, శివకాశీపురం, తోటకూరగొమ్ము, భూదేవిపేట, దాచారం, గొమ్ముగూడెం, రేపాకగొమ్ము, రుద్రంకోట, తదితర గ్రామాలలో బ్లీచింగ్ చల్లించడం, దోమల నియంత్రణ మందులను స్ప్రే జిల్లా మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది చేశారు. దాచారం, శివకాశీపురంలలో ఏర్పాటుచేసిన వరద సహాయక కేంద్రాలలో బాధితులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వరద ప్రభావిత గ్రామాలలోని ప్రజలకు ట్యాంకుల ద్వారా రక్షిత మంచినీటిని అందించారు. ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు సంభవించకుండా ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వరదనీటి మునిగిన గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద సహాయక కేంద్రాలు, వరద ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటుచేసింది.




