Kothagudem: కొత్తగూడెం నుంచి పాల్వంచ వరకు పాదయాత్రగా తలంబ్రాల సమర్పణ!

Kothagudem: కొత్తగూడెం నుంచి పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయానికి గణేష్ సేవా మహిళా భక్త బృందం పాదయాత్ర. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో తలంబ్రాల సమర్పణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Aug 2026 11:10 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం నుంచి పాల్వంచ వరకు పాదయాత్రగా తలంబ్రాల సమర్పణ!

Kothagudem: శ్రావణమాసం సందర్భంగా కొత్తగూడెం శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నుంచి పాల్వంచ శ్రీ కనకదుర్గ అమ్మవారి (పెద్దమ్మతల్లి) సన్నిధికి గణేష్ సేవా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో పాదయాత్రగా పాల్వంచకు చేరుకుని అమ్మవారికి తలంబ్రాలు సమర్పించారు.

గణేష్ సేవా మహిళా భక్త బృందం సభ్యులు ప్రతి ఏటా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణోత్సవానికి గోటి తలంబ్రాలను పాదయాత్రగా తీసుకెళ్లి సమర్పిస్తూ వస్తున్నారు. అదేవిధంగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి కూడా తలంబ్రాలను పాదయాత్రగా తీసుకెళ్లి సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బేబీ, మనీతో పాటు గణేష్ సేవా మహిళా భక్త బృందం సభ్యులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ పాదయాత్రకు భక్తులు విశేషంగా స్పందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story