Julurpadu: భద్రాద్రి జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందించాలి!
Julurpadu: జూలూరుపాడులో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడారు.
Julurpadu: భద్రాద్రి జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందించాలి!
Julurpadu: బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ఎరువుల సబ్సిడీ లక్షల కోట్లు భరిస్తూ రైతులకు ఒక కట్టకు ₹2,000 రూపాయలు సబ్సిడీ ఎరువులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నది. రైతులకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఒక కట్టకు 20 రూపాయలు లేదా 30 రూపాయలు వరకు ఉంటుంది. కనీసం ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. కనీసం ట్రాన్స్పోర్ట్ చార్జీలైన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులందరూ కూడా వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఏకైక ఆధారం గోదావరి జలాలు ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి అని చెప్పి రైతులు సీతారాం ప్రాజెక్టు కింద భూములు ఇచ్చినారు. కానీ ఈ ప్రాంత వాసులకు నీళ్లు ఇవ్వకుండా నాగార్జునసాగర్ కాలువలోకి నీళ్లు వచ్చే కాలువలోకే నీళ్లు ఎటువంటి అనుమతులు లేకుండా రెండు నెలలు తీసుకెళ్లారు.
నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చి మిగులు జలాలని ఇతర ప్రాంతాలకు తీసుకెళితే అభ్యంతరం లేదు. ఉమ్మడి జిల్లా ముగ్గురు మంత్రులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి భూ సేకరణ కు నిధులు ఎకరానికి ఇరవై ఒక్క లక్ష రూపాయలు కేటాయించి పంట నష్ట పరిహారం కూడా ఇచ్చి అవకాశం ఉన్న చెరువులకు తక్షణమే నీళ్లు విడుదల చేసి రాబోయే రబీ సీజన్ కల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ భూములు అన్నింటికీ కూడా నీళ్లు అందించాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బిజెపి మండల అధ్యక్షులు బుక్య రమేష్, సిరిపురపు ప్రసాద్, తెల్లం నరసింహారావు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సిరిపురపు పుల్లారావు, బయ్యవరపు వెంకటేశ్వర్లు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




