Julurupadu: కళ్లముందే నీళ్లు పారుతున్నా మాకు దక్కవా.. రైతుల ఆవేదన
Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఇవ్వాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన చేపట్టారు.
Julurupadu: కళ్లముందే నీళ్లు పారుతున్నా మాకు దక్కవా.. రైతుల ఆవేదన
Julurupadu: సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను జూలూరుపాడు మండలానికి ఇవ్వాలి CPM ఆధ్వర్యంలో రామచంద్రాపురం సమీపంలోని కాలువ వద్ద నిరసన సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను జూలూరుపాడు మండలానికి పిల్ల కాలువల ద్వారా ఇవ్వాలని శుక్రవారం సిపిఎం పార్టీ గుండెపుడి రామచంద్రపురం శాఖల ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో సీతారామ ప్రాజెక్ట్ కాలువ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకులు వి చందర్ రావు బానొత్ మదు పధ్దం సుగుణ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టునిళ్ళును ఈ జిల్లా రైతాంగానికి అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కానీ వేరే జిల్లాలకు తరలించడం వలన భద్రాద్రి జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ జిల్లా రైతాంగం ఈ నీళ్లు వస్తే రైతులు పంటలను పండించుకుంటారని ఎన్నో ఆశలతో లక్షల విలువైన భూములను ఈ కాలువ నిర్మాణానికి రైతులు ఇచ్చారని కానీ వారి భూముల నుండి రైతులు కళ్ళముందే నీళ్లు పారుతున్న మా భూములకు నీళ్లు రావట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శనివున్నట్టు ప్రధానంగా జూలూరుపాడు మండలానికి తీరని అన్యాయం జరిగిందని ఉమ్మడి జిల్లాలోని సాగునీటి అవకాశం లేని మండలం గా ఈ జూలూరుపాడు మండలం ఉందని అన్నారు.
కానీ అదే మండలం గుండా సీత రామ ప్రాజెక్ట్ నీళ్లు వెళుతున్న ఇక్కడ శాసనసభ్యుడు ఏమాత్రం పట్టించుకోకుండా రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని వారన్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జూలూరుపాడు మండలానికి సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను పిల్ల కాలువల సర్వే నిర్వహించారు కానీ రైతులకు నష్ట పరిహారాన్ని ఇంకా ప్రకటించడం లేదని తద్వారా రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి రైతులకు నష్టపరిహారం అందించి సర్వే చేసిన ప్రకారం పిల్ల కాలువల ద్వారా మండలంలో ఉన్న చెరువులకు నీళ్లను నింపాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ జిల్లా నుంచి ఇతర జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీళ్లను తరలించుకుపోతున్న ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు ఒక్కరైనా స్పందించకపోవడం జిల్లా రైతులను అవమానపరచడమేనని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో గుండెపుడి రామచంద్రపురం శాఖ కార్యదర్శులు ఇల్లంగీ సీతారాములు ఈసం నరసింహారావు నాయకులు పల్లమల్ల దానయ్య భూక్యా సురేష్ కోడం బక్కులు ఇందిరా నాగేశ్వరరావు గడిగ రాములు గడగ లక్ష్మణరావు రైతులు భానొత్ గిరి మూక్తీ గాంధీ తాటి బుచ్చి రాములు రాజు ప్రవీణ్ అశోకు తదితరులు పాల్గొన్నారు.




