Laxmidevipalli: అనిశెట్టిపల్లిలో వైభవంగా బొడ్రాయి పున ప్రతిష్ఠ మహోత్సవం!
Laxmidevipalli: అనిశెట్టిపల్లిలో బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పున ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పూజల్లో పాల్గొన్నారు.
Laxmidevipalli: అనిశెట్టిపల్లిలో వైభవంగా బొడ్రాయి పున ప్రతిష్ఠ మహోత్సవం!
లక్ష్మీదేవిపల్లి: మన ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచారాలను ప్రతిఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం, అనిశెట్టిపల్లి గ్రామంలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించిన బొడ్రాయి, ముత్యాలమ్మతల్లి పునప్రతిష్ఠ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇటువంటి శుభకార్యాలు భక్తిభావంతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తాయని, భవిష్యత్ తరాలకు మన మూలాలను అందిస్తాయని తెలిపారు.
గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామ ప్రజలంతా సమిష్టి కృషితో, కలిసికట్టుగా ఉంటూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇంతటి మహత్తరమైన పునప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్థులు ఐక్యతతో విజయవంతం చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు.
అనంతరం ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అన్నదానం వంటి సత్కార్యాలు సమాజంలో సేవాభావాన్ని, మానవత్వాన్ని చాటుతూ ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకట నర్సయ్య, రమణయ్య, వీరబాబు, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, సతీష్, శ్రీనివాసరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




