Kothagudem: కాంగ్రెస్ 2వ విడత ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం!

Kothagudem: కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2వ విడత ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 24 Aug 2026 4:28 PM IST
Kothagudem
X

Kothagudem: కాంగ్రెస్ 2వ విడత ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం!

Kothagudem: రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2వ విడత ఓటరు నమోదు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. విద్యానగర్‌లోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి లక్ష్మీదేవిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరగట్ల ప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి PCC అబ్జర్వర్ లింగోజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కొత్తగూడెం నియోజకవర్గ SIR ప్రోగ్రాం ఇన్‌చార్జ్ ఆళ్ల మురళి మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం కొత్తగూడెం నియోజకవర్గంలో 43 వేలకు పైగా ఓట్లు తొలగించబడ్డాయని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో గతంలో 32 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మరో రెండు కేంద్రాలు పెరగడంతో ప్రస్తుతం మొత్తం 34 పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.

2వ విడత ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ నూతన ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని వారి వివరాలను సేకరించడం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్ల పరిస్థితిని పరిశీలించడం, రెండు చోట్ల ఓటు నమోదైన డబుల్ ఎన్‌రోల్‌మెంట్ సమస్యలను గుర్తించి సరిదిద్దడం, పేర్లు మరియు చిరునామాల్లో మార్పులు, చేర్పులను సక్రమంగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని BLAలు, సూపర్‌వైజర్లకు సూచించారు.

PCC అబ్జర్వర్ లింగోజీ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షిస్తుందని హామీ ఇచ్చారు. నూతన ముసాయిదా ఓటరు జాబితాను BLAలు, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారందరూ ఓటరుగా నమోదయ్యేలా సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెదబాబు, పూనెం శ్రీనివాస్, BLAలు తాటి తిరుమలేశ్, కుంజ సూరిబాబు, దంసలపూడి సరిత, పూసం సత్యనారాయణ, బొల్లం రమేష్, జీడి మహేష్, బండ వెంకటేశ్వర్లు, కొంపెల్లి వీరయ్య, ఉబ్బన రాజు, దయ్యాల సమ్మయ్యతో పాటు సూపర్‌వైజర్లు నారబోయిన నరేష్, వార్స నరసింహారావు, సేవ, దేవేందర్, బొల్లి శ్రీను, డి.సురేష్, ఎస్‌కె.మహబూబ్, దరావత్ రమేష్, అజ్మీరా మోహన్, కొప్పుల రమణారెడ్డి, పాయం లక్ష్మీనర్సు, బొర్రా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story