Kothagudem: కొత్తగూడెంలో 80 కేంద్రాల్లో జాతీయ జెండాల ఆవిష్కరణ

Kothagudem: కొత్తగూడెంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 80 కేంద్రాల్లో జాతీయ జెండాల ఆవిష్కరణ. పతాకాన్ని ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2026 7:18 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో 80 కేంద్రాల్లో జాతీయ జెండాల ఆవిష్కరణ

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని 80 కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

కొత్తగూడెంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మెయిన్‌ హాస్పిటల్‌ సెంటర్‌, సూపర్‌ బజార్‌ సెంటర్‌, పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌, పాల్వంచలోని శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం, పాలకొయ్య తండా, జయమ్మ కాలనీ, వనమా కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సాధన కోసం కాంగ్రెస్ పార్టీ అనేక చారిత్రక పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తుచేశారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

దేశాన్ని మతాలు, వర్గాల పేరుతో విభజించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ, ప్రజలు అడ్డుకుంటారని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, దేశ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితాకుమారి, సొసైటీ చైర్మన్లు కొత్వాల శ్రీనివాసరావు, మండే వీర హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, జిల్లా అధికార ప్రతినిధి వై.

శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మంద హనుమంతు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎం. పెద్దబాబు, రాజేంద్రప్రసాద్, నాగార్జున, జిల్లా కార్యదర్శి నూకల రంగారావు, మండల, పట్టణ అధ్యక్షులు పరమేష్ యాదవ్, నర్రా అజయ్‌కుమార్, భువన సుందర్‌రెడ్డి, జేమ్స్ సునీల్, దేవరగట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story