Khammam: తెలంగాణ జరూర్ ఆనా టూరిజం బ్రాండ్ కిట్ ఆవిష్కరణ!

Khammam: జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో యువజనోత్సవ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. జాబ్ మేళాలో ఎంపికైన 105 మందికి ఆఫర్ లెటర్లు,

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 23 May 2026 5:55 PM IST
Khammam
X

Khammam: తెలంగాణ జరూర్ ఆనా టూరిజం బ్రాండ్ కిట్ ఆవిష్కరణ!

Khammam: పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 వ తేదీ నుండి ఈ రోజు వరకు యువజనోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా 04-05-2026న ఖమ్మంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన 105 మంది యువతీ యువకులకు జిల్లా కలెక్టర్ ప్రొవిజినల్ ఆఫర్ లెటర్లను అందజేశారు. యువత ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. యువత అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి బలమైన పునాది అని అన్నారు .

అనంతరం సీఎం కప్ – 2026తో పాటు ఇతర క్రీడా పోటీలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు, సమ్మర్ క్యాంపుల్లో విశేష ప్రతిభ ప్రదర్శించిన యువతకు జిల్లా కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేసి అభినందించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా యువత ప్రతిభ చాటుకోవడం గర్వకారణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం రూపొందించిన “తెలంగాణ టూరిజం బ్రాండ్ కిట్ – తెలంగాణ జరూర్ ఆనా”ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక, పర్యాటక విశేషాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఈ బ్రాండ్ కిట్ ఉపయోగపడుతుందని తెలిపారు .

జిల్లా యువతకు టూరిజం శాఖ అందిస్తున్న “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ మ్యూజియాలజీ” మరియు “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ ఆర్కియాలజీ” కోర్సుల గురించి కలెక్టర్ వివరించారు. టూరిజం రంగంపై ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందవచ్చని సూచించారు. కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కో-ఆర్డినేటర్ డా. పి. నాగరాజు (డీడీ, మ్యూజియమ్స్)ను ఫోన్ నెంబర్లు 9849905722, 9849905723 ద్వారా లేదా [email protected] ద్వారా సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి యం. పరంధామ రెడ్డి, GM DIC మధుసూదన్ రెడ్డి, PIO పృథ్వి, ప్రశాంతి నగర్ సర్పంచ్ లైలా, శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్ వనజ క్రీడ కోచ్ లు: అబ్దుల్ నబి, కాసి హుస్సేన్, నాగేశ్వర్ రావు, లగడపాటి రమేష్, Y. V. శ్రీనివాస్, డానియల్ రాంబాబు, నవీన్, గిరి ప్రసాద్, నాగేంద్ర, జగన్నాధ్, పాపరాజు, శ్రీనివాస్, నాగ శివాజీ, మల్లికార్జున్, ప్రమీల, రవి కిరణ్, అఖిల్, కార్యాలయ సిబ్బంది తిరుమలరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story