Burgampadu: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను సన్మానించిన సర్పంచులు

Burgampadu: మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను సన్మానించిన బూర్గంపాడు మండల సర్పంచులు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన నేతలు.

RAVI, BURGAMPAD AREA
Published on: 15 Sept 2026 6:02 PM IST
Burgampadu
X

Burgampadu: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను సన్మానించిన సర్పంచులు

బూర్గంపాడు: బూర్గంపాడు మండలం మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు బూర్గంపాడు మండలం చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం చేసిన సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ గారు మరియు సర్పంచులు.

ఈ సందర్భంగా కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మన ఊరు మన నిధులు గ్రామ అభివృద్ధి కోసం బిల్లు పాస్ చేసే దాంట్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి కృషిని అభినందించారు.

మరియు సారపాక మెయిన్ సెంటర్ నుండి సత్యనారాయణ స్వామి టెంపుల్ వరకు మెయిన్ రోడ్డు కి నిధులు కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం చేశారు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు అభివృద్ధికి బాటలు వేస్తూ గ్రామాల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వారి అడుగుజాడల్లో గ్రామాలను గ్రామపంచాయతీ నిధులతో అభివృద్ధి చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకెన్నో నిధులు తీసుకొచ్చి గ్రామపంచాయతీలు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మంద నాగరాజు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA