Kothagudem: బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోయి, అప్పులతో వ్యక్తి ఆత్మహత్య!
Kothagudem: కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో బెట్టింగ్‌లతో రూ. 40 లక్షలు పోగొట్టుకుని అప్పులపాలైన సాధనాల నాగేశ్వరరావు అనే వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు
Kothagudem: బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోయి, అప్పులతో వ్యక్తి ఆత్మహత్య!
Kothagudem: బూర్గంపాడు మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెట్టింగ్‌లకు బానిసైన ఓ వ్యక్తి సుమారు రూ.40 లక్షలు పోగొట్టుకుని అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బూర్గంపాడు మండలానికి చెందిన సాధనాల నాగేశ్వరరావు బెట్టింగ్‌లు ఆడుతూ సుమారు రూ.40 లక్షల వరకు నష్టపోయి అప్పుల పాలైన తీవ్ర మనస్తాపానికిగురై ఊరి చివరలోని చెట్టుకు ఉరివేసుకుని నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




