Kothagudem: పీపీఏకు హరీష్ రావు వినతిపత్రం
Kothagudem: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) అధికారులను కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బారాస నేతలు.
Kothagudem: పీపీఏకు హరీష్ రావు వినతిపత్రం
కొత్తగూడెం: భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు గురువారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) అధికారులను కలిసి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ తన్నీరు హరీష్ రావు గారు రాసిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలం డివిజన్‌లోని వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, అశ్వాపురం, మణుగూరు ప్రాంతాలు పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో ప్రతి ఏడాది వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
2022 గోదావరి వరదల సమయంలో లక్ష మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని, భద్రాచలం పట్టణంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయని, వేలాది కుటుంబాలు తీవ్ర ఆస్తి నష్టాన్ని చవిచూశాయని వివరించారు. అయినప్పటికీ బాధితులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హరీష్ రావు గారు తమ లేఖలో పేర్కొన్న విధంగా పోలవరం వల్ల నష్టపోయిన ప్రజలకు తక్షణ నష్టపరిహారం, ముంపు బాధిత కుటుంబాలకు పునరావాసం, భద్రాచలం పట్టణానికి శాశ్వత వరద రక్షణ చర్యలు, బూర్గంపాడు ప్రాంత రైతులకు పరిహారం, ప్రభావిత గ్రామాలకు రక్షణ కరకట్టల నిర్మాణం, అలాగే భద్రాచలంలో ప్రత్యేక పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రజలపై పోలవరం ప్రాజెక్టు కారణంగా పడుతున్న సామాజిక, ఆర్థిక, పర్యావరణ భారాన్ని కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ వెంటనే గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని BRS నాయకులు కోరారు. పోలవరం బాధితులకు న్యాయం జరిగే వరకు BRS పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజవర్గ నాయకులు మానే రామకృష్ణగారు, బూర్గంపాడు అశ్వాపురం మణుగూరు మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, కోడి అమరేందర్, కుర్రి నాగేశ్వరరావు కుంట లక్ష్మణ్, BRS నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, బూర్గంపాడు పిఎసిఎస్ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు,మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, జలగం జగదీష్, వల్లూరుపల్లి వంశీ, సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, దారం కృష్ణారెడ్డి, ఎక్కంటి శ్రీనివాసరెడ్డి, బూర్గంపాడు మాజీ సర్పంచ్ సిరిపురపు స్వప్న,బొల్లు సాంబశివరావు, రేపాక పూర్ణచందర్రావు, చల్లకోటి పూర్ణచంద్రరావు, తిరుపతి ఏసోబు,మొండెద్దుల వెంకటేశ్వర్ రెడ్డి, పాటి అశోక్, బానోత్ శ్రీను, బానోత్ అశోక్ తదితర BRS నాయకులు, ప్రజా ప్రతినిధులు, పోలవరం ప్రభావిత గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.




