Kothagudem: అర్ధరాత్రి చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

Kothagudem: చుంచుపల్లి పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూమ్‌లలో రాత్రివేళ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆకస్మిక తనిఖీలు నైట్ పెట్రోలింగ్‌పై కీలక ఆదేశాలు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 9 Sept 2026 1:17 PM IST
Kothagudem
X

Kothagudem: అర్ధరాత్రి చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

Kothagudem: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అర్ధరాత్రి చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రివేళల్లో పోలీసుల పనితీరు, నిఘా వ్యవస్థను పరిశీలించిన ఎస్పీ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సీసీ కెమెరాల ద్వారా కొనసాగుతున్న పర్యవేక్షణను ఎస్పీ పరిశీలించారు. అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలర్టింగ్ అధికారులు, రౌండింగ్ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ రాత్రి వేళల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.

ప్రధాన రహదారులు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసుల విజిబిలిటీ పెంచాలని సూచించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

అలాగే సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, సంబంధిత వ్యక్తుల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగించాలని ఎస్పీ సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

డయల్-112కు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. రాత్రివేళల్లో ప్రజలకు భద్రతపై మరింత నమ్మకం కలిగించేలా విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story