Bhadradri: ఐటీసీ గేటు వద్ద బాధితుల ధర్నా భూములు కోల్పోయినా దక్కని న్యాయం
Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొయ్యగూడెం ఐటీసీ గేటు వద్ద భూములు కోల్పోయినా న్యాయం జరగలేదని బాధితులు ధర్నా చేపట్టారు.
Bhadradri: ఐటీసీ గేటు వద్ద బాధితుల ధర్నా భూములు కోల్పోయినా దక్కని న్యాయం
Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొయ్యగూడెం పంచాయతీ పరిధిలోని ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారం గేటు వద్ద బాధితులు ధర్నాకు దిగారు. తమ స్థలం కర్మాగారం పరిధిలో ఉన్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.
ఏళ్లుగా సమస్యను పరిష్కరించకుండా ఐటీసీ యాజమాన్యం కాలయాపన చేస్తోందని బాధితులు మండిపడ్డారు. తమ భూమి, హక్కుల విషయంలో స్పష్టమైన పరిష్కారం చూపాలని, న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
బాధితుల గోడు పట్టించుకోకుండా కర్మాగార కార్యకలాపాలు కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ స్థలానికి న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఐటీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




