Kothagudem: మర్రిగూడెంలో ఫినిక్స్ ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరం!

Kothagudem: లక్ష్మీదేవిపల్లి మండలం మర్రిగూడెంలో ఫినిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 26 Aug 2026 5:17 PM IST
Kothagudem
X

Kothagudem: మర్రిగూడెంలో ఫినిక్స్ ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరం!

Kothagudem: కంటి చూపుతోనే మానవ జీవితానికి నిజమైన వెలుగు చేకూరుతుందని, దృష్టి లోపాలను నిర్లక్ష్యం చేస్తే జీవితమే అంధకారమవుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు.

లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక జేపీ పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన శంకర కంటి ఆస్పత్రి సహకారంతో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన సాబీర్ పాషా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ శరీరంలో కళ్ళు అత్యంత కీలకమైన భాగమని, కంటి చూపు లోపిస్తే నిత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటిస్తూ కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.

మారుమూల గిరిజన గ్రామాన్ని ఎంచుకుని పేద ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించేందుకు ఫినిక్స్ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శనీయమని, భవిష్యత్తులోనూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, సీపీఐ నాయకులు దీటి లక్ష్మీపతి, జలీల్ పాషా, దారా శ్రీను, సర్పంచులు రాంబాబు, తాటి లక్ష్మణ్, ఉమ, మౌనిక, రాము, ఎట్టి ఈశ్వర్, నరసింహారావు, శ్రీను, గోపాల్, వైద్యులు మరియా, జీవేరియా తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story