Kothagudem: ప్రజావాణిగా 90 ఏళ్ల ప్రస్థానం.. కొత్తగూడెం రేడియో స్టేషన్
Kothagudem: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా (1936-2026) భద్రాద్రి కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో ‘3కే వాక్తాన్’ నిర్వహించారు.
Kothagudem: ప్రజావాణిగా 90 ఏళ్ల ప్రస్థానం.. కొత్తగూడెం రేడియో స్టేషన్
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 90 వసంతాల ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకలు. (1936 -2026) వాయిస్ ఆఫ్ నేషన్ లో భాగంగా శుక్రవారం కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుండి 3కే వాక్తాన్ నిర్వహించారు. వాక్తాన్ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టి.భరత్ తొలుత జెండా ఊపి ప్రారంభించారు.
కొత్తగూడెం రేడియో స్టేషన్, 14 నంబర్ ఏరియా, రామవరం సెంటర్, నుండి తిరిగి 2టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా రేడియో స్టేషన్ వరకు సాగిన ఈ వాక్తాన్ కార్యక్రమంలో స్టేషన్ ప్రోగ్రాం హెడ్ కొలిపాక శంకర రావు పాల్గొని మాట్లాడారు. ఆకాశవాణి 90 వసంతాల ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
1936 ముందు దక్కన్ రేడియోగ ఉన్న రేడియో కాలక్రమంలో ఆకాశవాణిగా రూపాంతరం చెందింది. 2026 నాటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత దేశంలోని అన్ని రేడియో కేంద్రంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి మాధ్యమాలు అందుబాటులో లేని సమయంలో ఆకాశవాణి ప్రజావాణిగా వర్ధిల్లింది.
నాటి నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంత ప్రజలను, రైతులను, పండిత, పాములను అలరిస్తూ మారుమూల గ్రామాలలో సైతం ఆకాశవాణి జనరంజకంగా ప్రసారాలను ప్రసారం చేస్తుందని తెలిపారు.' బహుజన హితాయ: బహుజన సుఖాయ నినాదంతో....
ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, తుఫానుల ఎదురైన సందర్భంలో ఆకాశవాణి నిర్దిష్టమైన సమాచారం చేరవేస్తు, ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. ఈ నేపథ్యంలో 90 వసంతాల సందర్భంగా కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం "వాక్ తాన్ " కార్యక్రమాన్ని నిర్వహించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్, రామవరం పశు వైద్యులు డాక్టర్ ఆనంద్, పర్యావరణ ప్రేమికుడు నూర్వి రాజశేఖర్, సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ యం. బాబు సింగ్, స్టేషన్ సిబ్బంది, రేడియో వ్యాఖ్యాతలు ,తదితరులు పాల్గొన్నారు.




