Kothagudem: నేడే జాతీయ లోక్ అదాలత్.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి!
Kothagudem: జిల్లావ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్. రాజీ పడదగిన కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత సూచన.
Kothagudem: నేడే జాతీయ లోక్ అదాలత్.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో శనివారం (సెప్టెంబర్ 12) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత తెలిపారు.
జిల్లాలోని అన్ని న్యాయస్థానాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ (NI Act) కేసులు, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
లోక్ అదాలత్‌లో ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల కక్షిదారులకు సమయం, ధనం ఆదా కావడంతో పాటు సులభమైన, సంతృప్తికరమైన పరిష్కారం లభిస్తుందని వివరించారు.
కేసుల పరిష్కారం కోసం అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత కోరారు.




