Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కలకలం!
Bhadradri Kothagudem: బూర్గంపహాడ్‌లో పోలీసుల తనిఖీలు. 18.30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కర్ణాటకకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కలకలం!
Bhadradri Kothagudem: బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ముందు సోమవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 18.30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎస్సై మెడ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం అదనపు ఎస్ఐ నాగభిక్షం ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడింది.నిందితులను కర్ణాటక రాష్ట్రానికి చెందిన నవీన్ కుమార్ (శాహపూర్ గ్రామం), విజయ్ కుమార్ (మధుగిరి తాలూకా) గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుండి 18.30 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story




