Kothagudem: కొత్తగూడెంలో వింత.. కోడిపుంజుకు 'స్వీట్ సిక్స్టీన్'
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత ఓ కుటుంబం పెంచుకుంటున్న 'టింకు' అనే కోడిపుంజు 16 ఏళ్లు పూర్తి చేసుకుని 'స్వీట్ సిక్స్టీన్' వేడుక జరుపుకుంటోంది.
Kothagudem: కొత్తగూడెంలో వింత.. కోడిపుంజుకు 'స్వీట్ సిక్స్టీన్'
Kothagudem: టింకు పేరుతో అల్లారు ముద్దుగా కోడిపుంజును పెంచుతున్న కుటుంబం.. సాధారణంగా ఒక కోడి పుంజు ఐదు నుంచి పది సంవత్సరాల వరకు మాత్రమే జీవిస్తుంది. అయితే దీనికి భిన్నంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. చుంచుపల్లి మండలం రాంనగర్ కాలనీలో నివసిస్తున్న చెన్ను ప్రవీణ్, శైలజ దంపతులు ఓ నాటు కోడి పుంజును గత 16 ఏళ్లుగా పెంచుతున్నారు. కుటుంబంలో నలుగురు సభ్యులు ఉండగా, తమ కుమార్తెకు రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఈ కోడి పుంజును పెంచుతున్నామని ప్రవీణ్ తెలిపారు.
అలాగే రెండేళ్లుగా “లియో” అనే జాతి కుక్కను కూడా పెంచుతున్నామని, ఆ కుక్కతో కోడి పుంజు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి తిరుగుతుంటుందని చెప్పారు. ఎండాకాలం కావడంతో రెండూ కలిసి కూలర్ కింద పడుకొని ఆడుకుంటూ ఉంటాయని తెలిపారు. కోడి పుంజు పేరు “టింకు” అని, ప్రస్తుతం దాని వయసు 16 సంవత్సరాలని ప్రవీణ్ పేర్కొన్నారు. టింకు తమ కుటుంబంలో ఓ సభ్యుడిలా మారిపోయిందని, అది కేవలం సజ్జలు మాత్రమే తింటుందని, ఫ్రూట్స్ అంటే ఇష్టమని కూడా తెలిపారు.
దానిమ్మ గింజలు, గ్రేప్స్ పెడుతున్నట్లు తెలిపారు. ఇంకా రెండేళ్లు పాటు జీవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నాణ్యమైన ఆహారం, సరైన సంరక్షణ ఉంటే కోడి పుంజులు 15 సంవత్సరాలకు పైగా జీవించే అవకాశం ఉందని జిల్లా పశువైద్య శాఖ అధికారులు తెలిపారు.




