Bhadrachalam: గిరిజన పాఠశాల సమస్యలు పరిష్కరించాలి టీఎస్ టీటీఎఫ్!
Bhadrachalam: భద్రాచలంలో ITDA APO డేవిడ్ రాజును కలిసిన టీఎస్ టీటీఎఫ్ బృందం. గిరిజన ఆశ్రమ పాఠశాలల సమస్యలు, ఉపాధ్యాయుల ఇబ్బందులు తీర్చాలని ఈరు నాయక్ డిమాండ్.
Bhadrachalam: గిరిజన పాఠశాల సమస్యలు పరిష్కరించాలి టీఎస్ టీటీఎఫ్!
Bhadrachalam: భద్రాచలం సెప్టెంబర్ 12 - ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల వసతి గృహాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు మరియు పాఠశాలలో నెలకొన్న సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరు నాయక్ అన్నారు.
ఈరోజు ఐ టి డి ఏ గిరిజన సంక్షేమ శాఖ డిడి ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం సందర్శించి టీచర్లకు సంబంధించిన సమస్యలు మరియు పాఠశాలల్లో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
అనంతరం ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజును తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారంతోపాటు ఏజెన్సీ ప్రాంత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో TSTTF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ,ఉపాధ్యాయులు శోభన్ , మోతిలాల్ ,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.




