Bhadrachalam: బాలింతలు, గర్భిణీలకు మాతా శిశు సంరక్షణ కిట్ల పంపిణీ
Bhadrachalam: భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలకు సంరక్షణ కిట్ల పంపిణీ. పాల్గొన్న సర్పంచ్ పూనం కృష్ణ, వైద్యులు.
Bhadrachalam: బాలింతలు, గర్భిణీలకు మాతా శిశు సంరక్షణ కిట్ల పంపిణీ
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో రోటరీ క్లబ్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు తల్లి పిల్లల సంరక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ, గౌరవ అతిథిగా జిల్లా అధికారి మరియు వైద్య శాఖ అధికారి, ఆసుపత్రి సూపరిడెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ అధ్యక్షులు షేక్ అజీమ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆస్పత్రిలోని లబ్ధిదారులకు రూ.35 వేల విలువైన 70 కిట్లను పంపిణీ చేశారు. ప్రతి కిట్టు లోని గర్భిణీలకు బాలింతల ఆరోగ్యానికి అవసరమైన మల్టీ విటమిన్ టానిక్, ప్రోటీన్ పౌడర్, బ్రెడ్ లతోపాటు రెండు రకాల పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ఏదైతే ప్రాంతంలోని పేద గిరిజనుల తల్లి పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించిన అవసరం ఉందన్నారు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు రోటరీ క్లబ్ ఎప్పుడు ముందు ఉందని రోటి క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ పాపినేని రాజేష్, ట్రెజరర్ కొత్త రామకృష్ణ, క్లబ్ సలహాదారులు యశోదర రాంబాబు, వీరయ్య, ప్రభాకర్ గుప్త పాల్గొన్నారు. వివిధ పార్టీ రోటరీ క్లబ్ సభ్యులు సభ్యులు డాక్టర్ బి సంతోష్, విద్యాసాగర్, ఎండి రఫీ, జకరయ్య, వి.రాజశేఖర్, పి మోహన్ కృష్ణ, వి సాంబశివరావు, డి బాలాజీ, సీతారామరెడ్డి చలపతి లతో పాటు ఆస్పత్రి డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




