Bhadrachalam: బారికేడ్ల తొలగింపే మహిళ ప్రాణం తీసిందంటూ తీవ్ర విమర్శలు

Bhadrachalam: భద్రాచలం పొట్టి శ్రీరాములు సెంటర్‌లో బారికేడ్లు తొలగించడంతో ఘోర ప్రమాదం, మహిళ మృతి. తక్షణమే మళ్లీ బారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 14 Sept 2026 8:11 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: బారికేడ్ల తొలగింపే మహిళ ప్రాణం తీసిందంటూ తీవ్ర విమర్శలు

భద్రాచలం: భద్రాచలం పట్టణంలో ఎక్కువగా రద్దీగా ఉండే పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ ఆ ప్రాంతంలోని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏర్పాటు చేసిన భారీకేడ్లను తొలగించడం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో ఈ సెంటర్ వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ లు, ప్రమాదాలు జరుగుతుండటంతో పోలీసు, మున్సిపల్ అధికారులు రెండు సార్లు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. భారీకేడ్లు ఉన్నంత వరకు ఎటువంటి ప్రమాదాలు జరగలేదని, ట్రాఫిక్ కూడా క్రమబద్ధంగా సాగేదని స్థానికులు చెబుతున్నారు.

అయితే కొంతమంది వ్యాపారుల స్వార్థ ప్రయోజనాల కోసం, తమ వ్యాపారాలకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ భారీకేడ్లను తొలగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీకేడ్లు తొలగించిన నాటి నుండి మళ్లీ వాహనాలు ఇష్టానుసారంగా వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇదే భారీకేడ్లు ఉంటే ఆ నిండు ప్రాణం బలయ్యేది కాదు కదా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ప్రాణాల కన్నా వ్యాపారస్తుల వ్యాపారం ముఖ్యమా? అని పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తిరిగి శాశ్వత ప్రాతిపదికన భారీకేడ్లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అధికారులు ఒకసారి ఆలోచించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem