Bhadrachalam: మూడు రాష్ట్రాల మధ్య రవాణా కట్! భద్రాచలం కొత్త బ్రిడ్జికి ఏమైంది?
Bhadrachalam: భద్రాచలం కొత్త వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో టెన్షన్! సారపాక వైపు రోడ్డు దిగజారడంతో అధికారులు కొత్త బ్రిడ్జిని మూసివేశారు.
Bhadrachalam: మూడు రాష్ట్రాల మధ్య రవాణా కట్! భద్రాచలం కొత్త బ్రిడ్జికి ఏమైంది?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడు మండలం సారపాక – భద్రాచలం మధ్య నిర్మించిన కొత్త వంతెన అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వంతెనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వాహనాల రాకపోకలు నిత్యం కొనసాగుతుండటంతో ఘటన తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. సారపాక వైపు అప్రోచ్ రోడ్డులో భాగంగా నేల ఒక్కసారిగా దిగజారడంతో ప్రమాద సూచనలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కొత్త బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం – సారపాక మధ్య రాకపోకలు పాత బ్రిడ్జి మీదుగానే కొనసాగుతున్నాయి. భారీ వాహనాలు సహా అన్ని వాహనాలను పాత వంతెన వైపు మళ్లించారు. వాహనదారులు అప్రమత్తంగా, నెమ్మదిగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.




