Bhadrachalam: ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
Bhadrachalam: భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం. గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.
Bhadrachalam: ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
భద్రాచలం: భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో గౌరవ సర్పంచులు, మండల స్థాయి అధికారులు మరియు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ కలిసి గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ప్రజలకు మెరుగైన పాలన, మౌలిక సదుపాయాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని, ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వాటిని పరిష్కరించాలని కోరారు.
ఈ సమావేశంలో భద్రాచలం తహసీల్దార్ రవి గారు, స్పెషల్ ఆఫీసర్ బి. అప్పారావు గారు, గ్రామపంచాయతీ కార్యదర్శి చెరుకుమిల్లి శ్రీనివాసరావు, మండల ఎంఈఓ బెక్కంటి శ్రీనివాస్ , భద్రాచలం ట్రాఫిక్ ఎస్‌ఐ తిరుపతిరావు, వార్డు సభ్యులు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




