Bhadrachalam: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాము కుటుంబ పరామర్శ!

Bhadrachalam: భద్రాచలం ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మద్ది రాము మృతదేహాన్ని సందర్శించి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 15 Sept 2026 1:55 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాము కుటుంబ పరామర్శ!

Bhadrachalam: దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామానికి చెందిన మద్ది రాము నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడం పట్ల భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈరోజు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, పార్టీ నాయకులతో కలిసి మద్ది రాము గారి మృతదేహాన్ని పోస్టుమార్టం రూమ్ లో చూసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలుచుకొని కంటతడి పెట్టుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ విషాద సమయంలో కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మాట్లాడుతూ, మద్ది రాము మృతి ఎంతో బాధాకరమని, చిన్న వయసులోనే కుటుంబాన్ని విషాదంలోకి నెట్టిన ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem