Bhadrachalam: భద్రాచలం: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు!
Bhadrachalam: భద్రాచలం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించగా, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని పూజలు చేశారు.
Bhadrachalam: భద్రాచలం: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు!
Bhadrachalam: భద్రాచలం పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద వినాయక చవితి సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని పూజా కార్యక్రమంలో కూర్చోబెట్టి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమని, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు అన్నారు.
అనంతరం కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని శాలువాతో సత్కరించారు ఈకార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




