Bhadrachalam: టీవీఆర్ చంద్రం పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేయాలి
Bhadrachalam: భద్రాచలంలో సెప్టెంబర్ 10న జరిగే మార్క్సిస్టు నేత టీవీఆర్ చంద్రం పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేయాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు కోరారు.
Bhadrachalam: టీవీఆర్ చంద్రం పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేయాలి
భద్రాచలం: కడవరకు సిద్ధాంత, ఆచరణ కేవలం మార్క్సిస్టు లకే సాధ్యమని.. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరాయంగా పోరాటాలు నిర్వహించిన మార్క్సిస్టు ముద్దుబిడ్డ టివిఆర్ చంద్రం అని సిపిఐఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు.
ఈనెల 10న భద్రాచలం పట్టణంలోని కేకే ఫంక్షన్ హాల్ లోజరగనున్న టీవీ ఆర్ చంద్రం పుస్తక ఆవిష్కరణ సభ విజయవంతం చేయాలని ఆయన కోరారు. మారుమూల గ్రామమైన కూనవరంలో జన్మించిన టివిఆర్ చంద్రం వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షుడిగా జాతీయస్థాయిలో ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
భద్రాచలం నియోజకవర్గం లో కూనవరం కేంద్రంగా సిపిఐఎం శాఖలకు టివిఆర్ చంద్రం శ్రీకారం చుట్టారని మచ్చా గుర్తు చేశారు. 1931 లో జన్మించిన టివిఆర్ చంద్రం కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితుడై పని చేసి సిపిఐ ఎం రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారని అన్నారు.
2006 సెప్టెంబర్ 7న వయోభారంతో టివిఆర్ చంద్రం మృతి చెందినప్పటికీ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో మార్క్సిస్టు పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చంద్రం సజీవంగానే ఉన్నారని అన్నారు. టీవీఆర్ చంద్రం మరణించి 20 ఏళ్లు గడుస్తున్న నియోజవర్గ వ్యాప్తంగా నేటికీ టీవీ చంద్రం వర్ధంతి సభలు నిర్వహిస్తున్నామని అన్నారు.
అమరవీరులు తమ జీవితాలను ప్రాణాలను త్యాగం చేసి నిర్మించిన పార్టీని కాపాడుకోవటమే పార్టీ కార్యకర్తలపై ఉన్న ప్రధాన కర్తవ్యం అని మచ్చ వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా వస్తున్న ఒడిదుడుకులను ఎదుర్కొని భద్రాచలం నియోజకవర్గం లో సిపిఐఎం పూర్వ వైభవం సంతరించుకుంటుందని జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలకు మార్క్సిస్ట్ పార్టీ ఎర్రజెండా నే అండ ధైర్యమని మచ్చ స్పష్టం చేశారు.




